తెలంగాణ లోని జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం పొలాస శివారులో ఆదివారం ఆటోడ్రైవర్ నయీముద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ హత్యకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆటో కిరాయి 300 రూపాయల విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే బీహార్‌కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే ఇద్దరు నయిముద్దీన్‌ను అత్యంత పాశవికంగా కొట్టి చంపినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితులిద్దరూ హైదర్‌పల్లి శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కూలీలుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లుగా తెలిపారు. 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకొని రిమాండ్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు
ఆటో కిరాయి విషయంలో గొడవపడి ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసిన దుండగులు
September 17, 2025
0
Tags