కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ సభ వాయిదా !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కామారెడ్డిలో సెప్టెంబర్‌ 15న కాంగ్రెస్‌ నిర్వహించ తలపెట్టిన బీసీ డిక్లరేషన్‌ సభ వాయిదా వేసినట్లు టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా హాజరుకావాల్సి ఉంది. కాగా, ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)