రుషికొండ ప్యాలెస్ ను పిచ్చాసుపత్రిగా మార్చాలని నా సలహా !

Telugu Lo Computer
0


రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సలహా ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ పెచ్చులు ఊడిపోయాయని తెలిసిందని అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేదని అన్నారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని, అయితే దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని తన ఉచిత సలహా అని చెప్పుకొచ్చారు. అలా అయితే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు అని అశోక్‌ గజపతిరాజు అన్నారు. ప్రజా ధనాన్ని ప్రజా హితం కోసమే వాడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)