జియో తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటన

Telugu Lo Computer
0


జియో తొమ్మిదో వార్షికోత్సవం, యూజర్లు 50 కోట్లు దాటిన సందర్భంగా బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుత ప్లాన్‌ల ఆధారంగా యూజర్లందరికీ అపరిమిత డేటాను నెలపాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. రూ.349, ఆపై ప్లాన్‌లు ఉన్న వినియోగదారులకు సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 5వరకు ఈ ఆఫర్‌ను అందించడంతోపాటు వార్షికోత్సవ వారాంతం ఆఫర్‌ను ప్రకటించింది. వీకెండ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 5 నుంచి 7వరకు ప్రస్తుత ప్లాన్‌తో సంబంధం లేకుండా 5జీ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ అపరిమిత 5జీ డేటాను ఉచితంగా అందజేయనున్నట్లు జియో వెల్లడించింది. 4జీ వినియోగదారులు మాత్రం రూ.39తో రీఛార్జ్‌ చేసుకొని ఈ వీకెండ్‌లో అపరిమిత 4జీ డేటాను (రోజుకు గరిష్ఠంగా 3జీబీ) పొందవచ్చని తెలిపింది. రూ.349 ప్లాన్‌ (రోజుకు 2జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్‌) ఉన్న వారికి సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 5వరకు అపరిమిత 5జీ డేటా పొందవచ్చు. వీటితోపాటు జియోహోమ్‌ 2నెలల ఉచిత ట్రయల్‌ వంటి సదుపాయాలు అందించనుంది. ఇక రూ.349 ప్లాన్‌ను 12 నెలలు క్రమంగా రీఛార్జ్‌ చేసుకున్న వారికి మరో నెల ఉచితంగా సేవలు అందిస్తామని వెల్లడించింది. జియో తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ మాట్లాడుతూ 50 కోట్ల మంది కస్టమర్లు తమపై విశ్వాసం ఉంచడం గౌరవంగా భావిస్తున్నా. ఈ స్థానానికి చేరుకోవడం అనేది ప్రతి ఒక్కరు జీవితాల్లో జియో ఎలా భాగమైపోయిందనే విషయం అర్థమవుతోంది. ఈ మైలు రాయిని చేరుకున్నందుకు ప్రతి ఒక్క యూజర్‌కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)