జగన్‌తో పాటు జైలుకెళ్లేందుకు సజ్జల సిద్ధంగా ఉండాలి !

Telugu Lo Computer
0


ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అధికారం ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ధైర్యం ఉంటే వైకాపా ఎమ్మెల్యేలతో మాట్లాడించాలన్నారు. మాజీ సీఎం జగన్‌తోపాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల కూడా సిద్ధంగా ఉండాలన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా హయాంలో చాలా దోచుకున్నారని, రైతులకు ధాన్యం బకాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైకాపా నేతల విమర్శలకు తాము బెదిరిపోబోమని, వారు చేసిన దోపిడీలన్నీ బయటపెడతామని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)