ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ హాజరయ్యారు. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లుగా ఆయన ఇతర కార్యక్రమాలు, మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేసింది. కావాలనే ఆయన్ని పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేసింది. అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. కానీ నోట్ల కట్టల కేసుకు సంబంధించి జస్టిస్ యశ్వంత్‌వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో ఆయనకు విభేదాలు రావడం వల్లే వైదొలగినట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే శుక్రవారం సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ధన్‌ఖడ్ అందిరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ధన్‌ఖడ్ వెంకయ్య నాయుడితో ఏదో చెవిలో చెబుతూ కనిపించారు.
ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంలో జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రత్యక్షం !
September 12, 2025
0
Tags