దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో తొలి రోజు తెలుగు, కన్నడ భాషలకి చెందిన నటీనటులు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి అవార్డ్ దక్కగా, ఉత్తమ నటిగా రష్మిక అవార్డ్ తీసుకున్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు చేజిక్కించుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి చిత్రం నిలిచింది.పుష్ప2, కల్కి చిత్రాలకి ఎక్కువ అవార్డులు దక్కడం విశేషం. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చాలా మంది స్టార్స్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషా చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందచేసి సత్కరించే సైమా వేడుకల్లో ఇప్పుడు జరగుతున్నది 13వ ఎడిషన్. అయితే ఈ వేడుకలలో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డును తేజ (హనుమాన్) దక్కించుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్ ఫిమేల్ డిబ్యూటెంట్ అవార్డును భాగ్యశ్రీ గెలుచుకుంది.
ఉత్తమ నటీనటులుగా అల్లు అర్జున్, రష్మికకు సైమా అవార్డులు
September 06, 2025
0
Tags