భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు 2026 జూన్‌లో ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తికావాల్సిన నిర్మాణాలు, తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని సవాళ్లు ఎదురైనా జీఎంఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 86 శాతం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. విశాఖ నుంచి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి అనేక సార్లు సమీక్షలు నిర్వహించామన్నారు. మొత్తం ఏడు పాయింట్లు గుర్తించామని చెప్పారు. ''మార్చి, ఏప్రిల్‌లోగా ఈ రహదారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రతిపాదనలో ఉంది. బీచ్ కారిడార్ నిర్మాణం కోసం కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం. విశాఖ నుంచి కొచ్చికి కనెక్టివిటీ కోసం వినతులు వచ్చాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించాం.'' అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వచ్చే జూన్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు !
September 13, 2025
0
Tags