జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్‌ రేవణ్ణ !

Telugu Lo Computer
0


ర్నాటకలోని హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష పడి, ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో వున్నాడు.  జైలులో ఆయనకు లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం వంటి బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజుకి రూ.522 జీతంగా ప్రజ్వల్‌కు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు జైల్లో ఏదో ఒక రకమైన పని చేయాల్సి ఉంటుందని, వారి నైపుణ్యాలను బట్టి నియామకాలు చేపడతామన్నారు. ప్రజ్వల్‌ ఆఫీస్ వర్క్‌ను ఎంచుకోవడంతో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించామన్నారు. జైల్లో ఖైదీలు సాధారణంగా నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు తప్పకుండా పని చేయాలనే నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)