హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ నుంచి తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ ఒప్పందం !

Telugu Lo Computer
0


97 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందం విలువ రూ.62వేల కోట్లు. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. మిగ్‌-21 యుద్ధవిమానాల స్థానంలో ఈ సింగిల్‌ ఇంజిన్‌ ఎంకే-1ఏ తేజస్‌ జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో.. 68 యుద్ధవిమానాలు, 29 ట్విన్‌ సీటర్స్‌ ఉండనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక ఫైటర్‌ జెట్లలో ఉత్తమ్‌ AESA రాడార్‌, స్వయం రక్షా కవచ్‌ వ్యవస్థలతోపాటు కంట్రోల్‌ యాక్యుయేటర్‌లు ఉంటాయి. వీటిలో 64శాతానికి పైగా దేశీయ కంటెంట్‌, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది. 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మనిర్భర భారత్‌, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే, హెచ్‌ఏఎల్‌తో ఇది రెండో ఒప్పందం కాగా.. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ యుద్ధవిమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)