హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరింది. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. రోడ్లలన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఛత్రినాక, తార్నాక, హబ్సిగూడ, నాచారం, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ప్రగతినగర్, ఆల్విన్ కాలనీ, చార్మినార్, యూకత్‌పురా, ఓయూ క్యాంపస్, హైదర్‌నగర్, బాచుపల్లి, వివేకానంద నగర్, చార్మినార్, చాంద్రయణగుట్ట, బహదూర్‌పురా, లాలాపేట్, మల్లాపూర్, ఉప్పుగూడ, బార్కస్, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్ మంజీరా పైపులైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్‌లోకి వరదనీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించిన హైదరాబాద్ పోలీసులు
September 26, 2025
0
Tags