కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ప్రైమ్ ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్‌లో కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ప్రైమ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. కేవలం కొన్ని నెలల్లోనే 25,000 యూనిట్లకు పైగా అమ్ముడైన పాత ఈ-లూనాకు ఇది మరింత అప్‌డేటెడ్ వెర్షన్. ఈ కొత్త బైక్ తక్కువ ధరలో కావాల్సిన వారికి, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి, అలాగే రోజూవారీ పనులకు ఉపయోగపడే వాహనం కోసం చూస్తున్న వారికి సరైన సమాధానం అని కంపెనీ చెబుతోంది. ఈ-లూనా ప్రైమ్ అనేది అడ్వాన్సుడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో కూడిన వ్యక్తిగత రవాణా అవసరాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన విప్లవాత్మక బైక్. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన పాత ఈ-లూనా మోడల్ కేవలం కొన్ని నెలల్లోనే 25,000 యూనిట్లకు పైగా అమ్ముడై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ బ్రాండ్ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కైనెటిక్ గ్రీన్ ఇప్పుడు ఈ-లూనా ప్రైమ్ ను తీసుకువచ్చింది. దీనిలో ఉన్న 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ గతుకుల రోడ్లపై కూడా అద్భుతమైన స్థిరత్వాన్ని, మన్నికను అందిస్తాయి. దీనిలో సామాన్లు పెట్టుకోవడానికి పెద్ద ఫ్రంట్ లోడింగ్ ఏరియా ఉంది. ఇది డిజైన్, పర్ఫామెన్సులో మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంది. దీనిలో LED హెడ్‌ల్యాంప్, స్పోర్టీగా ఉండే సింగిల్ సీటు, డిజిటల్ కలర్డ్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఎఫెక్టివ్ ఫ్రంట్ వైజర్, ట్రెండీ రిమ్ టేప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 110 కి.మీ, 140 కి.మీ రేంజ్ ఇచ్చే రెండు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.82,490 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ ఆరు వేర్వేరు రంగుల్లో లభిస్తుంది. కస్టమర్‌లు తమ దగ్గర్లోని కైనెటిక్ గ్రీన్ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీనికి కిలోమీటరుకు కేవలం 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ బైక్‌ రన్నింగ్ ఖర్చు నెలకు కేవలం రూ.2,500 మాత్రమే. కేవలం ప్రయాణాలకే కాకుండా, కార్గో, చిన్నపాటి వ్యాపారాలు, ఇతర వినియోగ సేవలకు కూడా ఉపయోగపడే మల్టీ-యూటిలిటీ వెహికల్‌గా ఉపయోగపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)