ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో 80 శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది. స్మార్ట్ కార్డుల్లో వివరాలు తప్పుగా వచ్చిన కుటుంబాలు వెంటనే దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకోవచ్చని తెలిపింది. అయితే అక్టోబర్ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్మార్ట్ కార్డుల్లో కొందరి పేర్లు, వివరాలు తప్పుగా వచ్చాయి. అక్షర దోషాలు, ఇతర తప్పులు రావడంతో రేషన్ కార్డుదారులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. తమ పేర్లు, వయసు, ఇంటి నెంబర్లు స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పుగా ముద్రించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జారీ చేసిన స్మార్ట్ కార్డుల్లో ఏవైనా పేర్లలో తప్పులు సరిచేసుకోవడం.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటే.. కార్డు యజమానులు సంబంధిత సచివాలయాల్లోకి వెళ్లి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అక్టోబర్ 30వ తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ సూచించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 30 వరకు అవకాశం
September 12, 2025
0
Tags