ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గనుంది. ఇది రూ.69,999కి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.1,12,900గా ఉంది. దీనిపై రూ.42,901 తగ్గింపును అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ధరకు లభిస్తుందా? లేదా బ్యాంక్ ఆఫర్ కూడా అదనంగా వర్తిస్తుందా? అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఒకవేళ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటే ఐఫోన్ 16 ప్రో ధర మరింతగా తగ్గనుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అయితే ఎలాగూ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 16 (128జీబీ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.74,900గా ఉంది. దీనిపై కూడా భారీ డిస్కౌంట్ ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రూ.51,999కే అందుబాటులోకి రానుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంటే ఐఫోన్ 16 మరింత చౌకగా లభించనుంది. మరోవైపు ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను రూ.90,000 లోపు విక్రయించనున్నట్లు సమాచారం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్ ఆఫర్ !
September 12, 2025
0