ఈనెల 14 నుంచి వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం

Telugu Lo Computer
0


భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూలతలతో రద్దైన మాతా వైష్ణోదేవి యాత్ర ఈనెల 14 నుంచి తిరిగి ప్రారంభమవుతోంది. రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. యాత్ర వివరాలు, బుకింగ్స్‌ కోసం www.maavaishnodevi.orgను చూడాలని కోరింది. త్రికూట హిల్స్‌పై ఆగస్టు 26న భారీగా కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో 36 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పట్నించి ఈ మార్గాన్ని మూసేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)