తులం బంగారం 1,10,440

Telugu Lo Computer
0


తులం బంగారం రూ. లక్షా 10 వేలు దాటింది. ఇవాళ ఒక్క రోజే రూ. 1360 పెరిగింది. సిల్వర్ ధరలు కూడా అదే బాట పట్టాయి.  కిలో వెండిపై రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,029, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1250 పెరిగింది. దీంతో రూ.1,01,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1360 పెరిగింది. దీంతో రూ. 1,10,290 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,440 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,40,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)