టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్ : అక్టోబర్ రెండవ వారంలో సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగం

Telugu Lo Computer
0


క్టోబర్ రెండవ వారంలో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుండి మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ద్వారా ఈ సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమౌతున్నారు. ఎల్‌వీఎం-3ఎం మార్క్-5ను వచ్చేనెల రెండో వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. షార్ లో రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువైన బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఈ నెలాఖరులోగా ఉప గ్రహం భారత్‌కు చేరుకోనుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్ కు ప్రత్యక్ష అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధార పడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి.. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సీఎంఎస్‌-02 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు.. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సీఎంఎస్‌ ఉపగ్రహం దోహదపడుతుంది. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించారు. అయితే ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని అక్టోబర్ 15వ తారీకు నుండి 19వ తారీఖు లోపల ఈ LVM-03-M5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఈ రాకెట్ అనుసంధాన పనులను షార్ లోని వెహికిల్ అసెంబ్లింగ్ భవనంలో ముమ్మరంగా చేశారు. ఈ రాకెట్ ప్రయోగం గనుక విజయవంతం అయితే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)