జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల వార్షిక టోల్‌పాస్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు ఓ లింక్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లలో కూడా ఈ లింకు ఉంటుంది. కార్లు, జీపులు, వ్యానులు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. దీంతో ఇక టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ కార్డులు పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ఈ పాస్‌తో ప్రయాణించొచ్చు.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన వార్షిక టోల్‌పాస్
August 15, 2025
0
Tags