అత్తపై దాడి చేసి దారుణంగా కొట్టిన కోడలు : నెట్టింట వీడియో వైరల్

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కవి నగర్‌లో ఆకాంక్ష అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అత్తతో గొడవల కారణంగా ఆమెపై దాడి చేసింది. గొడవ జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అత్తపై దాడి చేసి దారుణంగా కొట్టింది. వయసు పైబడింది అని కూడా చూడకుండా కనికరం లేకుండా దాడి చేసింది. జూన్ 30న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆమె కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)