సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందన్నఅభిప్రాయాన్ని అమెరికా ఆర్థికవేత్త, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ వ్యక్తంచేశారు. అప్పటి వరకు భారత్ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన స్టీవ్ హాంకీ భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ''సుంకాలపై ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. 'తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిద'నేది నెపోలియన్ మాట. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచదేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోంది. భారత్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలి. ఎందుకంటే ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది'' అని ఆ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హాంకీ అంచనా వేశారు. టారిఫ్‌లపై ట్రంప్ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనివల్ల తమ ఆర్థికవ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుంది
August 09, 2025
0
Tags