కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

Telugu Lo Computer
0


స్ట్రేలియా గడ్డపై సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దుమ్మురేపుతున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఓ అజేయ శతకంతో చెలరేగిన డెవాల్డ్ బ్రెవిస్ తాజాగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రెవిస్ (26 బంతుల్లో ఫోర్,6 సిక్స్‌లతో 53) ఆదుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లతో 25) సాయంతో నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్‌కు తోడుగా రాసీ వాన్ డెర్ డస్సెల్(26 బంతుల్లో 3 ఫోర్లతో 38 నాటౌట్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/31) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/30), ఆడమ్ జంపా(2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం ద్వారా డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆసీస్ గడ్డపై టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. ఆస్ట్రేలియా గడ్డపై 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 12 సిక్స్‌లు కొట్టగా డెవాల్డ్ బ్రెవిస్ మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 14 సిక్స్‌లు బాది ఈ రికార్డ్‌ను అధిగమించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)