అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ గురించి ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు. 'తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానన్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా దూషించారో చెప్పాలి. మేము కూడా ఓట్లు వేసి ఉంటేనే ఎమ్మెల్యేవి అయ్యావ్. నాలుగు గోడల మధ్య కాదు, అభిమానుల ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)