జమ్మూకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ : నలుగురు మృతి

Telugu Lo Computer
0


మ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ చోటుచేసుకుంది. కథువా జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వరద ఉప్పొ్ంగడంతో పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్ కూడా ప్రభావితమైంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశామని, మరో ఆరుగురిని గాయపడిన స్థితిలో రక్షించి ఆసుపత్రికి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా చాలా జలాశయాలలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని, ఉజ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, ప్రజలు తమ భద్రత కోసం నీటి వనరులకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లుగా అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం క్లౌడ్ బరస్ట్తో 60 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)