వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా హై టెన్షన్‌ వైరు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)