ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.11వేల కోట్లతో నిర్మించిన రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించి మాట్లాడుతూ అధునాతన కనెక్టివిటీ పొందిన ఢిల్లీ ప్రజలకు అభినందనలు. ప్రపంచం భారత్‌పై ఓ అభిప్రాయానికి రావాలనుకున్నప్పుడు తొలుత దాని చూపు రాజధాని వైపు ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశానికి ఢిల్లీని ఓ నమూనాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ప్రభుత్వం అనేక స్థాయిల్లో కృషి చేస్తోంది. గడిచిన 11 ఏళ్లలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రయాణం సులభతరమైంది'' అని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు సమీప ప్రాంతాలకు ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ రెండు కొత్త ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే సోనిపట్, రోహ్‌తక్, బహదుర్‌గఢ్‌తోపాటు గురుగ్రామ్ నుంచి ఐజీఐ ఎయిర్‌పోర్టు వరకు ప్రయాణం సులభమవుతుందన్నారు. అంతకుముందు రోహిణి ప్రాంతంలో మెగా రోడ్ షో నిర్వహించి ప్రాజెక్టు పనుల గురించి సమీక్ష జరిపారు.
దేశానికి ఢిల్లీని ఓ నమూనాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది !
August 17, 2025
0
Tags