ట్రంప్‌ తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ హెచ్చరిక

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చర్యతో భారత్‌ - చైనా - రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ 'ఎక్స్‌​'లో పేర్కొన్నారు. సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్‌ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్‌పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్‌, ఢిల్లీ  ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)