ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను ఎవరైనా విక్రయించి ఉంటారనే అనుమానంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించిన పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఇటీవల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే చెల్లి వరసయ్యే మరో అమ్మాయితో పెళ్లి దుస్తుల్లో ఆ యువతి పోలీసుస్టేషన్‌కు తిరిగొచ్చింది. తాము వివాహం చేసుకున్నామని, ఇకపై భార్యాభర్తలుగా కలిసి జీవించాలని వారు పేర్కొనడంతో పోలీసులు, కుటుంబసభ్యులు కంగుతిన్నారు. తాను వరుడిగా మారి తన చెల్లెల్లిని వివాహం చేసుకున్నట్లు సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబ సభ్యులు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నామని వారు పోలీసులకు తెలియజేశారు. ఇంటికి తిరిగివెళ్లాలని వారిని ఒప్పించడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ ఇరువురూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇంటి నుంచి పారిపోయి చెల్లి వరసయ్యే అమ్మాయితో పెళ్లి చేసుకుని తిరిగి వచ్చిన యువతి !
August 08, 2025
0
Tags