భారత్‌పై సుంకాల పెంపు వెనుక ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావడమే తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య ఉద్దేశమని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటనీ కరోలినా లెవిట్టీ వెల్లడించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. మరో నాలుగు రోజుల్లోనే ఇంకో 25 శాతం పెంచారు. మీడియా బ్రీఫింగ్‌లో లెవిట్టీ మాట్లాడుతూ భారత్‌పై సుంకాల పెంపు వెనుక రష్యాపై ఒత్తిడి తేవడమేనని అన్నారు. 'ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు అన్నివైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.. భారత్‌పై సుంకాలు పెంపు సహా ఇతర చర్యలు తీసుకుంటున్నది మనం చూస్తున్నాం.. ఎలాగైనా యుద్ధం ముగించాలనే కృతనిశ్చయంతో ట్రంప్ ఉన్నారు.. ఏదైనా సమావేశానికి ముందు నెల రోజులు పాటు వేచిచూడాలనే ఇతరుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు'' అని లెవిట్టీ పేర్కొన్నారు. వీలైనంత తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు.
భారత్‌పై సుంకాల పెంపు వెనుక రహస్యం రష్యాపై ఒత్తిడి తేవడమే !
August 20, 2025
0
Tags