సాక్షి పత్రిక, చానల్ పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువునష్టం దావా

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానల్, సాక్షి పత్రికపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువునష్టం దావా వేశారు. ఆగస్టు 10, 14 తేదీల్లో సదరు టీవీ చానల్, పేపర్ లో టీటీడీపై నిరాధారమైన వార్తల్ని ప్రచురించారని, వాటి వల్ల తనకు వ్యక్తిగతంగా ప్రతిష్ఠ దెబ్బతినడంతో పాటు, భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తనకు ప్రతిష్ఠాభంగం కలిగించినందుకు, భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని, అలాగే టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆ చానల్ ప్రసారాలను ఆపివేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)