మహారాష్ట్ర లోని పూణే, పింప్రి-చించ్‌వాడ్‌లో 37 ఏళ్ల మిలింద్ కులకర్ణి అనే యువకుడు జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు తాగుతూ కనిపించాడు. ఆ క్రమంలోనే కళ్లు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోయాడు.దీంతో జిమ్‌లో ఉన్నవాళ్లు వెంటనే గమనించి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మిలింద్ భార్య కూడా ఒక డాక్టర్ కావడం విశేషం. గత ఆరు నెలలుగా అతను రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తున్నాడని తెలిసింది.ఈ సంఘటన అనేక మందిని కలచివేస్తుంది. ఆ యువకుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని జిమ్‌కి వెళ్లాడు. కానీ, అక్కడే అతని జీవితం ఆగిపోయింది. ఇలాంటి సంఘటనలు అనేక మందిలో భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి.
జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు విడిచిన యువకుడు
August 02, 2025
0
Tags