స్కూల్‌ నుంచి వస్తూ నాలాలో పడి చిన్నారి దుర్మరణం

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి తెరిచి ఉంచిన నాలాలో పడి దుర్మరణం చెందింది. స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తు‍న్న క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌ నుంచి తన తమ్ముడితో కలిసి వస్తున్న అఫ్రీన్‌ అనే ఎనిమిదేళ్ల చిన్నారి నాలాలో పడిపోయింది. వర్షాల కారణంగా నాలాలు మర్మమత్తులు చేసే క్రమంలో ఒక చోట నాలాను తెరిచే ఉంచారు. అది నీటిలో కలిసిపోయి ఉండటంతో నాలా ఎక్కుడ ఉందనే విషయాన్ని ఆ చిన్నారులు గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే అఫ్రీన్‌ నాలాపై అడుగేయగా అందులోకి జారిపోయింది. దాంతో అక్కడ అఫ్రీన్‌ను నాలాలోకి జారిపోవడంతో తమ్ముడు గట్టిగా అరవగా, స్థానికులు వచ్చి రక్షించే యత్నం చేశారు. అప్పటికే ఆ చిన్నారి 50 మీటర్ల లోతులోకివెళ్లిపోవడంతో ప్రాణాం కోల్పోయింది. ఆ నాలా నుంచి తిరిగి తీసిన తర్వాత ఆ చిన్నారికి సీపీఆర్‌ చేశారు స్థానికులు. అయిన్పటికీ చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారి మృత్యువాత పడినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)