తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ వెల్లడించింది. ఆగస్ట్ 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు, అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల చేయనుంది. ఆగస్టు 23వతేదీ ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 23వతేదీ మధ్యాహ్నం 3గంటలకు ఇవ్వనుందని టీటీడీ తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆగస్టు 25వతేదీ ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి ఆ ప్రకటనలో కోరింది.
ఆగస్టు 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
August 14, 2025
0
Tags