2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదానీ గ్రూప్ రికార్డు స్థాయిలో రూ. 90,572 కోట్ల వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనానికి ముందు ఆదాయాన్ని నమోదు చేసింది. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల నుంచి గణనీయమైన సహకారం లభించడంతో ఈ వృద్ధి సాకారమైంది. కంపెనీల పోర్ట్ ఫోలియో మెరుగైన పనితీరు ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయాలకు తోడ్పడటంతో పాటు, తక్కువ రుణ నిష్పత్తిని కొనసాగించింది. ఆ సంస్థ ఆర్థిక పనితీరు వివరాలను ఆగస్టు 28, 2025న ప్రకటించింది. గత 12 నెలల పనితీరుతో పాటు, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం, దాని రుణ పనితీరును కూడా వెల్లడించింది. పోర్ట్ ఫోలియో EBITDA తొలిసారిగా రూ. 90,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. Q1FY26 EBITDA కూడా రికార్డు స్థాయికి చేరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ & సెజ్, అంబుజా సిమెంట్స్‌తో పాటు ఏఈఎల్ కింద ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌లో నిలకడ వృద్ధి ఈ బలమైన పనితీరుకు దోహదపడింది.ఈ వ్యాపారాల నుండి లభించిన బలమైన సహకారం, ఏఈఎల్ ప్రస్తుత వ్యాపారాల్లో క్షీణతను భర్తీ చేసింది. ఐఆర్ఎం (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)లో వాణిజ్య పరిమాణం తగ్గడం, సూచీ ధరల అస్థిరత కారణంగా ఏఈఎల్ ప్రస్తుత వ్యాపారంలో ప్రతికూల వృద్ధి నమోదైంది.నిలకడగా విస్తరిస్తున్న EBITDA, కంపెనీ ప్రణాళికాబద్ధమైన వార్షిక మూలధన వ్యయం రూ. 1.5-రూ. 1.6 లక్షల కోట్లకు బలమైన మద్దతునిస్తుంది. అదానీ గ్రూప్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 90,572 కోట్ల రికార్డు EBITDAను సాధించినట్లు నివేదించింది.
తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసిన అదానీ గ్రూప్
August 28, 2025
0
Tags