ఫార్చునర్ కారును ఓవర్ టేక్ చేశారని చితకబాదిన యువకులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బండ్లగూడ సవేరా హోటల్ దగ్గర సోమవారం ఫార్చునర్ కారులో వచ్చిన యువకులు. కారును ఓవర్ టేక్ చేశారని రోడ్డుపైనే కారు ఆపి బైక్ పై ఉన్న యువకులపై దాడికి పాల్పడ్డారు. బైక్ పై నుంచి కిందికి తోసి మీదపడి పిడిగుద్దులు గుద్దారు. అంతటితో ఆగకుండా బ్యాట్ తో విచక్షణా రహితంగా కొట్టారు. మధ్యాహ్నం యువకులు బైక్ పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఫార్చూనర్ కార్‌ బైకు ముందు ఆపిన గుర్తు తెలియని వ్యక్తులు.. బైక్ పై వెళ్తున్న యువకులను కిందికి తోసేశారు. మా కారుకే సైడ్ కొడతావా అంటూ మీదపడి దాడికి దిగారు. అందరూ చూస్తుండగా బైక్ పై వెళుతున్న వ్యక్తిపై పట్టపగలే దాడి చేయడం దారుణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)