వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం 'బ్రెయిన్‌'

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్‌ బయోడిజైన్‌ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (బీఆర్‌ఐఏఎన్‌-బ్రెయిన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆసియా పసిఫిక్‌ బయోడిజైన్‌ అలయన్స్‌కు చెందిన వివిధ దేశాల వైద్య నిపుణులతో సీఎం సమావేశమయ్యారు. అమరావతిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో అంతర్భాగంగా ఈ రిసెర్చ్‌ ఇన్నోవేషన్‌ కార్యకలాపాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ, మెడ్‌టెక్‌ అలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్‌ బయోడిజైన్‌ అలయన్స్‌, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏపీని వైద్య రంగంలో ఆవిష్కరణలు మెడ్‌టెక్‌ పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే రోడ్‌మ్యాప్‌పై సీఎం చర్చించారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతికత బదిలీ, స్టార్టప్‌, ఇంక్యుబేషన్‌ తదితర రంగాల్లో సహకారంపై అంతర్జాతీయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదరింది. ఇందులో భాగంగా భారత్‌ బయోడిజైన్‌-బయోడిజైన్‌ ఆస్ట్రేలియా కలిసి పనిచేయనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)