భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి, ప్రసిద్ధ స్పోర్ట్స్ మెడిసిన్ వైద్యుడు, మాజీ హాకీ ఆటగాడు వేస్ పేస్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు.1945లో గోవాలో జన్మించిన వేస్ పేస్, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనబరిచారు. హాకీ ఆటలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ, మిడ్‌ఫీల్డర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1972లో జర్మనీ, మ్యూనిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో వేస్ పేస్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన ఆటలో చూపిన చురుకుదనం, వ్యూహాత్మక నైపుణ్యం జట్టుకు గెలుపు దిశగా నడిపింది. హాకీ ఆటతో పాటు వైద్య రంగంపై కూడా వేస్ పేస్‌కు ప్రత్యేక ఆసక్తి ఉండేది. స్పోర్ట్స్ మెడిసిన్‌లో నైపుణ్యం సంపాదించి, అనేకమంది క్రీడాకారులకు వైద్య సహాయం అందించారు. క్రీడా గాయాల చికిత్స, ఆటగాళ్ల ఫిట్‌నెస్ మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయన చేసిన సేవలు అమూల్యం. వేస్ పేస్ కుటుంబం క్రీడా రంగంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఆయన భార్య కూడా ప్రతిభావంతమైన క్రీడాకారిణే. భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె, 1972 ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. భార్యా,భర్తలిద్దరూ ఒలింపిక్స్‌లో ఆడి, దేశానికి గౌరవం తెచ్చిన అరుదైన జంటగా నిలిచారు.
లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ కన్నుమూత
August 14, 2025
0
Tags