ఇండోర్ లో రిటైర్డ్ జడ్జి ఇంట్లో చోరీ : వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్

Telugu Lo Computer
0


ధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో రిటైర్డ్ జడ్జి ఇంట్లో భారీ చోరి జరిగింది. చోరీకి చెందిన ఘటన నెట్టింట తెగ హల్ చేస్తుంది. రాత్రిపూట ముగ్గురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, కొంత మంది బెడ్ పక్కనున్న బీరువా లాకర్ను పగుల కొట్టారు. మరో వ్యక్తి బైట కాపాలాగా ఉన్నాడు. బెడ్ మీద రిటైర్డ్ జడ్జి కొడుకు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన నిద్రలేస్తే రాడ్ తో కొట్టేందుకు ఆయన పక్కనే ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. కానీ ఆయన లక్ బాగుందో ఏంటో కానీ వారు భారీగా డబ్బులు, నగదు తీసుకుని పోయిన ఆయనకు మెళకువ రాలేదు. దీంతో దొంగలు వచ్చిన పనిని జెట్ స్పీడ్ లో చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై స్థానికంగా ఉన్న పోలీసులకు రిటైర్డ్ జడ్జి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ ను , జాగిలాలను రప్పించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)