దేశీయ మార్కెట్లో లెనోవో కొత్త ఎంట్రీ-లెవల్ టాబ్లెట్ ఐడియా ట్యాబ్ ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 8GB RAM తో పాటు 11 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో 7,040mAh బ్యాటరీ 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది. Wi-Fi, 5G వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఇందులో 8MP రియర్ కెమెరా, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. Wi-Fi వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్, Lenovo Tab Penతో రూ. 16,999గా ఉంది. అదే కాన్ఫిగరేషన్ 5G వేరియంట్ ధర రూ.19,999 గా నిర్ణయించింది కంపెనీ. ప్రస్తుతం ఈ టాబ్లెట్ లెనోవో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్ లూనా గ్రే కలర్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ టాబ్లెట్ తక్కువ ధరలో 5G ఆప్షన్, AI ఫీచర్లు, హై-క్వాలిటీ డిస్‌ప్లేతో రావడం వల్ల స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్ ఇంకా ఎంటర్టైన్‌మెంట్ ఇష్టపడే యూజర్స్‌కు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
లెనోవో టాబ్లెట్ ఐడియా ట్యాబ్ విడుదల
August 08, 2025
0
Tags