సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం వ్యవహారంతో తమకు గానీ, ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి గానీ ఎలాంటి సంబంధం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసుల విచారణలో కొన్ని విషయాలు తెలిశాయన్నారు. ''సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో కేజీహెచ్, ఏఎంసీలో పని చేసే ఇద్దరు వైద్యుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ వ్యక్తిగత హోదాలో సేవలు అందించి ఉండొచ్చు. వారి ఫోన్లు పని చేయడం లేదు. వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు. వైద్యుల పాత్రపై నివేదిక వచ్చాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం'' అన్నారు.
'సృష్టి' వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు : కేజీహెచ్ సూపరింటెండెంట్
August 09, 2025
0
Tags