ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేషన్ చిత్రం మహా అవతార్ నరసింహ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ యానిమేషన్ చిత్రం సాధించని రికార్డును అందుకుంది. జులై 25న విడుదలైన ఈ చిత్రం, ప్రారంభంలో పెద్దగా ప్రచారం లేకపోయినా కేవలం ఒక వారంలోనే అద్భుతమైన కంటెంట్, హోంబలే ఫిల్మ్స్ మార్కెటింగ్ వ్యూహాల వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. విడుదలైన 30 రోజుల్లోనే మహా అవతార్ నరసింహ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ యానిమేషన్ చిత్రం ఇంత భారీ మొత్తం సంపాదించలేదు. అంతేకాదు, గత రెండేళ్లలో విడుదలైన స్పైడర్‌మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, అవతార్ వంటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు కూడా భారతదేశంలో ఇంత మొత్తం వసూలు చేయలేదంటే ఈ సినిమా విజయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
రూ.300 కోట్ల మార్క్‌ను దాటిన తొలి యానిమేషన్ చిత్రం మహా అవతార్ నరసింహ
August 28, 2025
0
Tags