బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 120మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లడక్ లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా 600 మంది సిబ్బంది డిన్నర్ చేశారు. అయితే తిన్న వెంటనే కొందరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. "కొంతమందికి తీవ్రమైన డీహైడ్రేషన్ వచ్చింది, మరికొందరికి కడుపు నొప్పి, వాంతులు, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్, తలనొప్పి ఉన్నాయి అని వైద్యులు తెలిపారు. దాదాపు 600 మందికి ఆహారాన్ని వడ్డించారని, అందులో 120 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
ధురంధర్ మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్ : 120 మందికి అస్వస్థత
August 19, 2025
0
Tags