ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నాం : సిద్ధరామయ్య

Telugu Lo Computer
0


హారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)