దేశంలో టయోటా కంపెనీ తమ ఆక్వా హైబ్రిడ్ కార్లను టెస్ట్ చేస్తోంది. ఈ కారు 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారు దేశీయ మార్కెట్‌లో ఒక పెద్ద విప్లవాన్నే సృష్టిస్తుందని భావిస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టాటా, మారుతి, టయోటా వంటి కంపెనీలు ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా టయోటా కంపెనీ తమ ఆక్వా అనే కారును దేశంలో టెస్ట్ చేస్తోంది. ఈ కారు ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ రకం కారు. ఈ కారు అంతర్జాతీయ మార్కెట్‌లో 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కారు పెద్ద ఎత్తున ఆకర్షించడంతో ఇప్పుడు భారతదేశంలో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ కారును టయోటా కంపెనీ 2021లో మొదటిసారి పరిచయం చేసింది. ఈ కారు జపాన్‌లో ప్రియస్ సి అనే పేరుతో అమ్ముడైంది. ఇది టిఎన్‌జిఏ ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేయబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌లో యారీస్, సియంటా వంటి కార్లు కూడా తయారు చేయబడ్డాయి. దీనిలో 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ అమర్చారు. ఈ కారు గరిష్టంగా 116 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను దీనికి అమర్చారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే ఉపయోగిస్తే 90 బిహెచ్‌పి పవర్, 120 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ముందు భాగంలో ఉన్న మోటార్ 80 బిహెచ్‌పి పవర్‌ను, 141 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగల కెపాసిటీని కలిగి ఉంది. 4 వీల్ డ్రైవ్‌లో ఇది 64 బిహెచ్‌పి పవర్‌ను, 52 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇ-సీవీటీ గేర్‌బాక్స్‌తో రూపొందించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా బైపోలార్ నికెల్ హైడ్రోజన్ బ్యాటరీని ఈ కారులో ఉపయోగించారు. ఇందులో ఎక్కువ పవర్‌ను స్టోర్ చేయవచ్చు. టయోటా కంపెనీ ఇంతకు ముందు ఆర్‌ఏవీ4, యారీస్, సి-హెచ్‌ఆర్ వంటి కార్లను కూడా టెస్ట్ చేసింది. కానీ, ఈ కార్లు ఏవీ అమ్మకాలకు రాలేదు.
ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే టయోటా ఆక్వా హైబ్రిడ్ కారు ?
July 01, 2025
0
Tags