హైదరాబాద్‌లోని చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాత బస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ స్థలాన్ని కబ్జాదారులు వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు. చదును చేసి షెడ్డులు నిర్మించి కిరాయికి ఇస్తున్నారు. మూసీ ఆక్రమణలపై హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు చేపట్టారు. ఆక్రమణ దారు తికారంసింగ్ 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. మరో ఆక్రమణదారు పూనమ్ చాంద్ యాదవ్ 1.30 ఎకరాల మేర కబ్జా చేశాడు. జయకృష్ణ అనే ఆక్రమణదారు 5.22 ఎకరాల మేర కబ్జా చేశాడు . కబ్జా చేసిన వారంతా అక్కడ షెడ్డులు వేసి వాటిని అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఆక్రమణదారులు బస్సులు, లారీల పార్కింగ్ కోసం కిరాయికి ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. మూసీ గర్భంలో మట్టిపోసి షెడ్డులని నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. నర్సరీ బిజినెస్ నిర్వహణ, ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.
చాదరఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు ఆక్రమణలను తొలగించిన హైడ్రా !
July 29, 2025
0
Tags