రాజమండ్రిలో హీరో రామ్ హోటల్ గది లోకి చొరబడిన ఆగంతకులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది. అందుకోసం రామ్ రాజమండ్రిలోని షెరటాన్ హోటల్‌లో బస చేస్తున్నారు. రామ్ స్టే చేస్తున్న హోటల్ దగ్గర హైడ్రామా జరిగింది. సోమవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్ కు చేరుకున్న రామ్ 6వ అంతస్తులోని వీఐపీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ర్రాత్రి 10 గంటల ప్రాంతంలో, ఇద్దరు ఆగంతకులు హీరో రామ్ తరపున స్టాఫ్ లో భాగమని చెప్పుకుంటూ హోటల్ సిబ్బందిని సంప్రదించి లిఫ్ట్ యాక్సెస్ కోరారు. మొదట వారిని అనుమంచిన హోటల్ యాజమాన్యం వారి మాయమాటలు నమ్మి వారికి యాక్సెస్ మంజూరు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ లో 6వ అంతస్తులోని రామ్ గది వద్దకు చేరుకొని మాస్టర్ కీ ఇవ్వాలని హౌస్ కీపింగ్ సిబ్బందితో చిన్నపాటి వాదనకు దిగారు. కీ తీసుకున్న ఆ ఇద్దరు దానిని ఉపయోగించి రామ్ గదిలోకి ప్రవేశించారు. అయితే వీఐపీ సూట్ కావడంతో, ఆ గదిలో లోపల మరో బెడ్‌రూమ్ ఉంది, అక్కడ రామ్ తలుపు లాక్ చేసి నిద్రిస్తున్నాడు. ఆ ఇద్దరు రామ్ నిద్రిస్తున్న రూమ్ డోర్ ను గట్టిగా తన్నడంతో మేల్కొని ఏదో జరుగుతుందని గ్రహించి వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీని లైన్ లోకి తీసుకున్నాడు. వాళ్లు వెంటనే రామ్ రూమ్ వద్దకు చేరుకొని ఆ ఇద్దరు అగంతలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)