మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు తెరిచారు. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతోంది.
సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో బాబ్లీ గేట్లు తెరిచిన అధికారులు
July 01, 2025
0
Tags