బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు

Telugu Lo Computer
0


బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తులు నుంచి మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవిస్తాయని ''కామ్రేడ్‌ పినరయి విజయన్‌'' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్‌ బృందాలు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, నకిలీ బాంబు బెదిరింపు అయి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. మెయిల్‌ పంపిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇలావుండగా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లకు, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలు గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి సైతం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు అధికారుల నివాసాలు, ఆస్పత్రులు, కళాశాలలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)