ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Telugu Lo Computer
0

ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాగల 2 గంటల్లో భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. నగర వ్యాప్తంగా పలు అండర్‌పాస్‌లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)