హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వి. పవన్ కుమార్ (24) ఎల్లారెడ్డిగూడలోని ఓ పేయింగ్ గెస్ట్ లో ఉంటూ మృతి చెందాడు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న పవన్, మొదట వినోదంగా ఆడిన రమ్మీ, క్రమంగా అతని అలవాటుగా మారింది. చిన్నగా మొదలైన బెట్టింగ్‌లు పెద్ద మొత్తాలకి చేరడంతో, నష్టాలను కప్పేందుకు అతను ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకుంటూ పోయాడు. ఒకసారి అప్పు ప్రారంభమైన తర్వాత, మరో యాప్ నుంచి తీసుకుని అప్పును కడతాను అన్న ఆలోచనలో నిండా మునిగిపోయాడు. కొన్ని నెలల క్రితం, ఆన్‌లైన్ జూదంలో పడిన రూ.50,000 అప్పును ఆయన తండ్రి తీర్చారు. కొడుకు మళ్లీ మారిపోతాడని ఆశించారు. కానీ అదే చక్రం మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నాలుగు మొబైల్ లెండింగ్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. "మళ్లీ కుటుంబానికి చెప్పలేక, తీవ్ర ఒత్తిడిలో ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు," అని పోలీసు అధికారి తెలిపారు. "సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. కానీ ఆయన ఫోన్‌లో పరిశీలన చేస్తే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది," అని పోలీసులు చెప్పారు. ఆర్థిక ఒత్తిడి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అప్పుల ఒత్తిడి అన్నీ కలిసివచ్చి పవన్‌ను మానసికంగాఇబ్బంది పెట్టి ఈలాంటి తీవ్ర స్థితికి తీసుకొచ్చాయి. చివరకు, ఇంట్లో ఎవరికి చెప్పకుండానే అతను తన ప్రాణాలను తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. అతని ఫోన్‌లో ఉన్న చాట్‌లు, యాప్ యాక్టివిటీలు చూస్తే ఎంతమేరకు ఆన్‌లైన్ గేమింగ్ జీవితాన్ని నియంత్రించగలదో స్పష్టంగా అర్థమవుతోంది.
అప్పుల బాధతో టెకీ ఆత్మహత్య !
July 09, 2025
0
Tags