'ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ' ఛైర్మన్‌ అరెస్టు

Telugu Lo Computer
0


ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ తిప్పనేని రామదాసప్పను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రామదాసప్పతోపాటు ఆయన కుమారుడు సాయికిరణ్‌ను మంగళవారం అమరావతిలో అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో 2వేలకుపైగా బాధితుల నుంచి రామదాసప్ప రూ.140 కోట్లు వసూలు చేశారు. 2వేల మార్కెటింగ్‌ మేనేజర్‌ ఉద్యోగాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు వారిని సంప్రదించి పెద్దమొత్తాల్లో నగదు చెల్లించారు. ఆ తర్వాత రైతుల నుంచి పెట్టుబడులు తేవాలని, లేదంటే జీతం నుంచి తీసుకుంటామని రామదాసప్ప ఉద్యోగులను వేధించారు. తీసుకున్న సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో అతడిపై తెలుగు రాష్ట్రాల్లోని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సీఐడీ అధికారులు తాజాగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)